ఆ ఒక్కటి తప్ప అంతా పూర్తి చేసుకున్న ‘పెద్ది’!?

ఆ ఒక్కటి తప్ప అంతా పూర్తి చేసుకున్న ‘పెద్ది’!?

Published on Apr 12, 2026 3:01 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామానే పెద్ది. మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులలో స్పెషల్ ఐటమ్ సాంగ్ పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ ఒక్క పాట విషయంలో ఇప్పటికీ టీం ఒక కొలిక్కి రాలేదు అని తెలుస్తోంది.

ఈ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ మొత్తాన్ని బుచ్చిబాబు అండ్ టీం పూర్తి చేసేసారట. సో ఆ ఒక్క సాంగ్ కూడా పూర్తయితే పెద్ది మొత్తం కంప్లీట్ అయినట్టే అని చెప్పొచ్చు. ఎలాగో ఏప్రిల్ విడుదల కూడా లేదని అర్ధం అయ్యిపోయింది. మరి కొత్త డేట్ ఏంటి ఎప్పుడు ఇస్తారు అనేవి రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు