విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘దృశ్యం’ విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. అలనాటి హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వ ప్రతిభను ప్రత్యేకంగా ప్రసంశిస్తున్నారు. ఆమె దర్శకత్వ ప్రతిభ చూసి ముగ్డులైన దర్శకరత్న దాసరి తన స్వగృహంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జయసుధ, రాధిక కూడా పాల్గొన్నారు.
శ్రీప్రియ దాసరి శిష్యురాలు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘స్వప్న’ చిత్రానికి శ్రీప్రియ సహాయ దర్శకురాలిగా పనిచేశారు. దాసరి దర్సకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘నక్షత్రం’లో హీరోయిన్ గా నటించారు. ఇది తెలుగులో జయసుధ నటించిన ‘శివరంజని’ చిత్రానికి రీమేక్.


