ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన ఓ గృహ సముదాయం సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియ శరన్ మీద వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించనున్నాడు. కిషోర్ పార్ధసాని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


