తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సంగీత దిగ్గజాలను ఒక చోట చేర్చి వారి ప్రతిభకు పట్టం కడుతున్న కార్యక్రమం ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’. గత నాలుగేళ్ళుగా రేడియో మిర్చి 98.3 ఎఫ్.యం. నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంగీత అభిమానులు, సినిమా ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. ఇప్పుడు ఐదవ వార్షికోత్సవంలో అడుగుపెట్టింది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సౌత్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్-2013’ కార్యక్రమం ఆగస్ట్ 16న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ లో జరగనుంది. ప్రతి ఏడాది జరిగినట్టుగానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిచడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు భాషలలో అతిరధ సంగీత మహారధులు ఈ వేడుకకు హాజరవుతున్నారు.
2013 సంవత్సరానికి గాను బెస్ట్ ఆల్బమ్ అఫ్ ది ఇయర్, బెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ అవార్డులను నిర్ణయించే అధికారం శ్రోతలకు అందిస్తుంది రేడియో మిర్చి 98.3 ఎఫ్.యం. ఛానల్. ఇవి రెండు కాకుండా మరో 14 విభాగాలలో అవార్డులను అందిస్తున్నారు. ఈ విభాగాలలో విజేతలను సినిమా ప్రముఖులతో కూడిన న్యాయ నిర్ణేతల ప్యానెల్ నిర్ణయిస్తుంది. తెలుగు న్యాయ నిర్ణేతల విభాగానికి నిర్మాత డి.సురేష్ బాబు చైర్మెన్ గా నియమితులయ్యారు.
మరిన్ని వివరాలకు www.radiomirchi.com వెబ్ సైట్ ని సందర్శించండి. లేదా రేడియో మిర్చి 98.3 ఎఫ్.యం. వినండి.


