శర్వా ఆశలన్నీ రన్ రాజా రన్ పైనే

శర్వా ఆశలన్నీ రన్ రాజా రన్ పైనే

Published on Jul 31, 2014 9:37 AM IST

Run Raja Run

వెన్నెల లో వన్నె తగ్గని పాత్రతో పరిచయమై, సంక్రాంతిలో వెంకీకి తమ్ముడిగా, గమ్యం లో ప్రేమను వెతుక్కునే ప్రేమికుడిగా, ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ తనయుడిగా, అందరి బంధువయ సినిమాలో బాధ్యత కలిగిన పౌరుడిగా పాత్రలలో ఒదిగిపోయాడు శర్వానంద్. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు అయినా, కావలిసినంత టాలెంట్ వున్నా శర్వాకి పాపం ఇప్పటివరకూ సరైన బ్రేక్ రాకపోవడం బాధాకరం. తీస్తున్న అన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నా వసూళ్ళను మాత్రం అందుకోలేకపోతున్నాయి

ఈ నేపధ్యంలో శర్వానంద్ కి ఒక కమర్షియల్ హిట్ అత్యంత అవసరం. ప్రస్తుతం ఆ హిట్ కోరికని ‘రన్ రాజా రన్’ ద్వారా తీర్చుకునే ప్రయత్నంలో వున్నాడు. మిర్చి సినిమాను నిర్మించిన స్నేహితుల బృందం ఈ సినిమాను కూడా నిర్మించడంతో, 25 ఏళ్ళ యువకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై ప్రేక్షకుల కళ్ళు పడ్డాయి. ట్రైలర్ లు, పోస్టర్ లు చూశాక సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక జిబ్రన్ అందించిన సంగీతం శ్రోతలకు చేరువవ్వడం ముఖ్యమైన అంశం. సో అన్నీ కలిపి ఈ సినిమా శర్వాకి ఒక కమర్షియల్ హిట్ ఇవ్వనున్నాయో లేదో తెలియాలంటే ఈ శుక్రవారం వరకూ ఆగాల్సిందే…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు