హైదరాబాద్లో ‘ఆగడు’ క్లైమాక్స్ షూటింగ్..!

హైదరాబాద్లో ‘ఆగడు’ క్లైమాక్స్ షూటింగ్..!

Published on Aug 2, 2014 4:00 PM IST

aagadu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా ‘ఆగడు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటివలే శృతి హాసన్, మహేష్ లపై ప్రత్యేక గీతం చిత్రీకరించారు. నేటి నుండి హైదరాబాద్లో క్లైమాక్స్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేశారు. స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు ముందు షెడ్యూల్ లో రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాలలో కొంత క్లైమాక్స్ పార్ట్ షూట్ చేశారు.

మహేష్ బాబు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్ పూర్తయితే మిగిలిన రెండు పాటలను నార్వేలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు