
స్వతహాగా టాలెంటెడ్ హీరో అయిన సిద్ధార్ధ్ గత కొన్నాళ్ళుగా సరైన హిట్ లభించక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడుతున్నాడు. కాకపోతే ఇతగాడు నటించి నిన్న తమిళనాట విడుదలైన గ్యాంగ్ స్టర్ సినిమకు అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది
ఈ జిగిర్తంద సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఇతను గతంలో పిజ్జా సినిమాను తెరకెక్కించాడు. ఒక గ్యాంగ్ స్టర్ ప్రేమకధను సిద్ధార్ధ్ అద్భుతంగా నటించి సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇటీవలధనుష్ నటించిన ‘VIP’ సినిమా విడుదలకారణంగా ఈ చిత్ర విడుదల వాయిదాపడింది. అయితే ఆ బాధను మరిచిపోయి సిద్ధూ ఇప్పుడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు
ఈ చిత్రాన్ని తెలుగులో చిక్కడు దొరకడు పేరుతొ అనువదించారు. లక్ష్మి మీనన్ హీరోయిన్

