శ్రీవిష్ణు హీరోగా ఆర్.కె మీడియా ద్విభాషా చిత్రం.

శ్రీవిష్ణు హీరోగా ఆర్.కె మీడియా ద్విభాషా చిత్రం.

Published on Aug 19, 2014 3:01 PM IST

sri-vishnu

సినిమా ప్రమోషన్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆర్.కె మీడియా అధినేత రవి కుమార్ పనస నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా ‘నల దమయంతి’ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘ప్రతినిధి’ సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నారు. అంజలి గుప్త హీరొయిన్. నిఖిత నారాయణ్ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

‘నల దమయంతి’ సెట్స్ పై ఉండగానే మరో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు రవి కుమార్ పనస. హాంగ్ కాంగ్ కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఎస్.వి.ఆర్ వెంచర్స్ ఇండియా ప్రై .లి వారి హౌస్ ఫుల్ మూవీస్ ఇండియా ప్రై లి కంపెనీతో కలసి సంయుక్తంగా సినిమాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు. హిందీ భాషలలో సినిమాలను నిర్మించడానికి హౌస్ ఫుల్ మూవీస్ ఇండియా ప్రై లి & ఆర్.కె మీడియా సంస్థలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

ప్రముఖ రచయత దర్శకుడు మదన్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన వేణు దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ శ్రీ విష్ణు సరసన నటించనుంది. ఈ చిత్రానికి సురేష్ యువన్ సంగీతం అందిస్తున్నాడు.

కెమేరా: విజయ్ సి కుమార్ పాటలు:చంద్రబోస్ ,సిరా శ్రీ కందికొండ ,మిట్టపల్లి సురేంద్ర ఆర్ట్: రాజీవ్ నైర్ నిర్మాతలు : రవి కుమార్ పనస ,ఎస్ వి ఆర్ ,సురేష్ బొమ్మెర

సంబంధిత సమాచారం

తాజా వార్తలు