యూఎస్ మార్కెట్ లో ‘అనగనగా ఒక రాజు’ లేటెస్ట్ వసూళ్లు!

యూఎస్ మార్కెట్ లో ‘అనగనగా ఒక రాజు’ లేటెస్ట్ వసూళ్లు!

Published on Jan 25, 2026 12:58 PM IST

Anaganaga Oka Raju

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా హీరోయిన్ మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో దర్శకుడు మారి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా నవీన్ కెరీర్ లోనే రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.

లేటెస్ట్ గా నార్త్ అమెరికాలో ఈ సినిమా 1.7 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి లాంగ్ రన్ లో 2 మిలియన్ మార్క్ పై ఈ సినిమా కన్నేసింది అనుకోవచ్చు. సో ఈ సినిమా ఆ మార్క్ ని రీచ్ అవుతుందో లేదో చూడాలి. ఇక చిత్రంలో రావు రమేష్, చమ్మక్ చంద్ర తదితరులు నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు