మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అందించిన లాస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “దేవర” (Devara) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో సోలోగా రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ దే’వర’ 2 కోసం కూడా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై చాలానే రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి. కానీ లేటెస్ట్ ఈ పార్ట్ 2 కోసం ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది.
Devara New Version – మరోసారి కొత్త వెర్షన్ వినిపించిన కొరటాల?
తారక్ తో రీసెంట్ గానే కొరటాల అండ్ టీం కలిసి దేవర 2 (Devara 2) కొత్త వెర్షన్ ని వినిపించినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మెయిన్ గా పార్ట్ 1 లో వీక్ అనిపించిన అంశాలని కొరటాల బలంగా మార్చినట్టు టాక్.
Key focus on Second Half – మెయిన్ గా సెకండాఫ్ మీద ఫోకస్
దేవర 1 రిలీజ్ అయ్యాక వచ్చిన ఫీడ్ బ్యాక్ లో సెకండాఫ్ మీద కొంచెం కంప్లైంట్స్ వచ్చాయి. అయితే దీనినే కొరటాల ఇప్పుడు సరిచేసినట్టు తెలుస్తుంది. తన టీంతో కలిసి ఒక స్ట్రాంగ్ సెకండాఫ్ ని దేవర 2 (Devara 2) కోసం డిజైన్ చేశారట. మరి దీనిపై ఎన్టీఆర్ టేక్ ఏంటి అనేది రివీల్ కావాల్సి ఉంది.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


