కిక్ 2 ఓపెనింగ్’లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ సందడి.

కిక్ 2 ఓపెనింగ్’లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ సందడి.

Published on Aug 20, 2014 11:05 AM IST

kick2

మాస్ మహారాజ్ రవితేజ, ‘రేసుగుర్రం’ విజయంతో మంచి జోరు మీదున్న దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కిక్ 2’ సినిమా ముహూర్తం ఈ రోజు(ఆగస్ట్ 20) ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ‘కిక్’ తరహలో ‘కిక్ 2’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆశించారు. ‘కిక్’తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన రవితేజ, సురేందర్ రెడ్డి సీక్వెల్లో డబుల్ కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.

‘అతనొక్కడే’ సినిమాతో సురేందర్ రెడ్డిని దర్శకుడు చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. వక్కంతం వంశి కథను అందించారు. ‘కిక్’ చిత్రానికి సంగీతం అందించిన తమన్ సీక్వెల్ కి కూడా సంగీతం అందిస్తున్నారు. ఫ్లైట్ మిస్ కావడంతో తమన్ ముహూర్త కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు