రఘు కుంచె ‘గేదెలరాజు’ విడుదల వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

రఘు కుంచె ‘గేదెలరాజు’ విడుదల వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

Published on Apr 10, 2026 11:00 AM IST

2 1

రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గేదెలరాజు’. “కాకినాడ తాలుకా సినిమా” అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ ఒక చిన్న అప్‌డేట్ ఇచ్చారు. ముందుగా అనుకున్న తేదీకి కాకుండా మరో వారం రోజుల తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

బాక్సాఫీస్ పోటీతోనే మార్పు

నిజానికి ‘గేదెలరాజు’ సినిమాను ఏప్రిల్ 17న గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్మాత, దర్శకుడు చైతన్య మోటూరి ప్లాన్ చేశారు. కానీ, అనుకోకుండా అదే రోజున ఏకంగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. ఇంత భారీ పోటీ మధ్య సినిమాను రిలీజ్ చేస్తే తగినన్ని థియేటర్లు దొరక్కపోవచ్చు. పైగా మంచి కంటెంట్ ఉన్న సినిమా జనాల్లోకి సరిగ్గా వెళ్లదేమో అన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు మేకర్స్‌కు ఒక సలహా ఇచ్చారు. దీంతో వారి సూచన మేరకు రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 24కు మార్చారు.

పది సినిమాల మధ్యలో రిలీజ్ చేసి మంచి కంటెంట్ ఉన్న సినిమాను రిస్క్‌లో పెట్టడం ఇష్టం లేకనే వారం రోజులు వాయిదా వేశామని రఘు కుంచె, చైతన్య మోటూరి స్పష్టం చేశారు. ట్రైలర్ చూసిన వాళ్లంతా బాగుందని ప్రశంసించడంతో సినిమాపై ఆర్గానిక్‌గా మంచి బజ్ క్రియేట్ అయిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో రఘు కుంచెతో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 24న థియేటర్లలోకి వస్తున్న ఈ ‘గేదెలరాజు’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.NEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు