‘డెకాయిట్’ పై ఫిదా అయిన నాని.. అస్సలు మిస్ కావద్దు..!

‘డెకాయిట్’ పై ఫిదా అయిన నాని.. అస్సలు మిస్ కావద్దు..!

Published on Apr 10, 2026 12:01 PM IST

daciot

అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ మూవీ పై నేచురల్ స్టార్ నాని ఫిదా అయ్యాడు. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
​ఈ సినిమాను వీక్షించిన నాని సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకుంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

“డెకాయిట్ ఒక నిజమైన బ్లాక్‌బస్టర్.. ఇదొక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ కావద్దు” అని పేర్కొన్నాడు. అడివి శేష్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని, మృణాల్ తన పాత్రలో ఒదిగిపోయిందని కొనియాడుతూ.. దర్శకుడి పనితీరును, అద్భుతమైన విజువల్స్‌ను నాని ప్రత్యేకంగా అభినందించాడు.

​అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. నాని వంటి స్టార్ హీరో నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. అడివి శేష్ తనదైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను మరోసారి మెప్పించడంలో సక్సెస్ అయ్యాడని నాని పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది.

తాజా వార్తలు