ఒక వారం ముందుగానే రానున్న నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’

ఒక వారం ముందుగానే రానున్న నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’

Published on Aug 20, 2014 11:34 AM IST

okalila-kosam

ఏ మాత్రం గ్యాప్ లేకుండా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఒక లైలా కోసం’. ముందుగా ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాని అనుకున్న టైం కంటే ఒక వారం ముందే విడుదల చేయనున్నారు. అనగా ఆగష్టు 29న అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కోసం వెళ్లనుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికి ఈ మూవీలోని మూడు పాటలను రిలీజ్ చేసారు. మిగిలిన పాటలని కూడా త్వరలోనే ర్రిలీజ్ చేయనున్నారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిచాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు