
మాస్ మహారజ రవితేజ హీరోగా నటించిన ‘కిక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ‘కిక్ 2’ కూడా తెరకెక్కనున్న సంగతి మేము ఇది వరకే తెలియజేశాం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్త కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభమైన ఈ రోజే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాని సమ్మర్ కానుకగా 2015 మార్చి 28న రిలీజ్ చేయనున్నారు. ప్రారంభం రోజే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడం అనేది టాలీవుడ్ లో అరుదుగా జరిగే విషయం. వక్కంతం వంశీ కథని అందిస్తున్న ఈ సినిమాలోని టెక్నీషియన్స్, నటీనటుల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

