పవన్ కళ్యాణ్ సినిమాలో దీక్షా పంత్.

పవన్ కళ్యాణ్ సినిమాలో దీక్షా పంత్.

Published on Aug 20, 2014 2:00 PM IST

Deeksha-Panth
దీక్షా పంత్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. చిన్న సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తున్న దీక్షా పంత్ కు చాలా పెద్ద ఆఫర్ లభించింది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న ‘గోపాల గోపాల’లో గోపి మైయ్య పాత్రలో నటించే అవకాశం లభించింది. హిందీ ‘ఓ మై గాడ్’లో పూనమ్ ఝావేర్ గోపి మైయ్యగా నటించింది. ఆమె నటనను కాపీ కొట్టకుండా తన టాలెంట్ చూపడానికి ప్రయత్నిస్తానని చెప్తుంది.

మిథున్ చక్రవర్తితో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సింగిల్ టేక్ యాక్టర్ అతను. నన్ను చూడగానే నువ్వు గోపి మైయ్య పాత్రకు పర్ఫెక్ట్ సెలక్షన్. అని కాంప్లిమెంట్స్ ఇవ్వడం మర్చిపోలేనని దీక్షా పంత్ తెలిపింది. ‘గోపాల గోపాల’తో తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

కిషోర్ పార్దాసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు