హిందీ ‘మగధీర’లో షాహిద్ కపూర్.?

హిందీ ‘మగధీర’లో షాహిద్ కపూర్.?

Published on Aug 20, 2014 10:27 PM IST

Shahid
టాలీవుడ్ సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించనున్నాడనే కొన్ని వార్తలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ కూడా ‘మగధీర సినిమా చూసాను, నాకు చాలా బాగా నచ్చిందని’ అన్నాడు. కానీ తను ఈ సినిమా చేయనున్నట్లు మాత్రం ఖరారు చేయలేదు.

ప్రస్తుతం షాహిద్ కపూర్ ‘హైదర్’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ తో కిక్ తీసిన సాజిద్ నదియావాలా మగధీర రీమేక్ రైట్స్ ని కొనుకున్నాడు. టాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన మగధీర హిందీలో రిమేక్ అయితే ఆ రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి..

తాజా వార్తలు