అప్పుడు పవన్.. ఇప్పుడు విజయ్.. రిజల్ట్ సేమ్ వచ్చేనా..?

అప్పుడు పవన్.. ఇప్పుడు విజయ్.. రిజల్ట్ సేమ్ వచ్చేనా..?

Published on Apr 10, 2026 11:00 AM IST

vijay pk

దళపతి విజయ్ తన కెరీర్‌లో ఆఖరి చిత్రంగా నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అన్‌సెన్సార్డ్ ఫుటేజీ అర్ధరాత్రి ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం కొన్ని దృశ్యాలు బయటకు రాగానే చిత్ర యూనిట్ హెచ్చరించినప్పటికీ, కొద్ది గంటల్లోనే పూర్తి సినిమా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

​గతంలో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ విషయంలో ఇలాగే జరిగినా, సినిమాను వెంటనే విడుదల చేసి విజయం సాధించారు. కానీ ‘జన నాయగన్’ ఇంకా సెన్సార్ పూర్తి చేసుకోకపోవడం, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విడుదల వాయిదా పడటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే ఇలా లీక్ అవ్వడం థియేట్రికల్ బిజినెస్‌పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.

​హెచ్. వినోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా లీక్ అయినప్పటికీ, విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు థియేటర్లలోనే చూస్తారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సెన్సార్ బోర్డు త్వరగా స్పందించి క్లియరెన్స్ ఇస్తే, ఎన్నికల తర్వాత వెంటనే సినిమాను విడుదల చేసి నష్టాన్ని తగ్గించుకోవాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది.

తాజా వార్తలు