ఫ్లాష్ న్యూస్: పుట్టిన రోజుకి నేపాల్ వెళ్ళనున్న చిరంజీవి

ఫ్లాష్ న్యూస్: పుట్టిన రోజుకి నేపాల్ వెళ్ళనున్న చిరంజీవి

Published on Aug 21, 2014 3:00 AM IST

chiranjeevi1
ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత విధంగా ఈ ఆగష్టు 22 గురించి కొన్ని లక్షలమంది ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుపడంతో దానికి ఈ తేదినే సరైనదని అందరూ అభిప్రాయపడ్డారు

అయితే చిరంజీవి క్యాంప్ నుండి అందిన సమాచారం ప్రకారం చిరు 150వ సినిమాకు ఇంకా కధ ఖరారు కాలేదని, ఒక్కసారి కధ నచ్చాక దర్శకుడి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. కాకపోతే చిరంజీవి 150వ చిత్రం ఆద్యంతం కామెడి మరియు ఎంటర్టైనర్ గానే వుంటుంది తప్ప మెసేజ్ ఓరియెంటెడ్/ హిస్టారికల్ సినిమా కాదని స్పష్టం చేశారు

చిరు పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి నేపాల్ వెళ్లనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో అక్కడి గుడికి వెళ్లి తరువాత కాలక్షేపంకోసం స్పా కి వెళ్లనున్నారు. చిరు పుట్టిన రోజు వేడుకలను ఇక్కడ రామ్ చరణ్ నిర్వహించనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు