‘లవర్స్’తో మారుతి స్టైల్ చేంజ్ చేశాడు.

‘లవర్స్’తో మారుతి స్టైల్ చేంజ్ చేశాడు.

Published on Aug 21, 2014 12:26 PM IST

maruthi

మారుతి.. లో బడ్జెట్ సినిమాలతో భారి విజయాలు అందుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో దూసుకొచ్చిన తారాజువ్వ. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాలలో డబల్ మీనింగ్ డైలాగులతో యువతను ఆకట్టుకున్నాడు. ‘ప్రేమ కధా చిత్రమ్’తో తనపై పడ్డ బూతు ముద్రను చెరిపేసుకున్నాడు. కాని మారుతి సమర్పణలో ఇతర దర్శకులు తెరకెక్కించిన సినిమాలలో శృంగార సన్నివేశాలు, బూతు డైలాగులు ఎక్కువగా ఉండడంతో మరోసారి విమర్శకుల బాణాలకు బలయిపోయాడు. ఇకపై అటువంటి సీన్ రిపీట్ కాదంటున్నాడు.

మారుతి సమర్పణలో ఇటివల విడుదలైన ‘లవర్స్’ మంచి విజయాన్ని నమోదు చేసింది. క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా పేరు పొందింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మారుతి మాట్లడుతూ.. ఇతర దర్శకులను, న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో మారుతి టాకీస్ బ్యానర్ స్థాపించాను. నేను దర్శకత్వం వహించిన సినిమాలకు మంచి పేరొచ్చింది. ఇతర దర్శకులు చేసిన సినిమాలకు చెడ్డ పేరొచ్చింది. ‘లవర్స్’ దర్శకుడు హరి ఆ మచ్చను చెరిపేశాడు. ఇకపై దర్శకుల ఎంపికలో జాగ్రత్త వహిస్తాను. అని అన్నారు. మొత్తానికి తన స్టైల్ చేంజ్ చేశాడు మారుతి.

‘లవర్స్’ విజయానికి సమిష్టి కృషి కారణం. ప్రేక్షకులను నవ్వించాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. కలెక్షన్స్ బాగున్నాయి. నిర్మాతలు, పంపిణిదారులు సంతోషంగా ఉన్నారు. అని తెలిపారు మారుతి.

తాజా వార్తలు