విశాల్ సినిమాలో రమ్యకృష్ణ

విశాల్ సినిమాలో రమ్యకృష్ణ

Published on Aug 21, 2014 11:53 AM IST

Ramya-Krishna
ఒకప్పుడు తన గ్లామర్, నటనతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులని అలరించిన రమ్యకృష్ణ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. రమ్యకృష్ణకి ఆఫర్స్ వస్తున్నా ఎందుకె వాటిపై పూర్తి ఆసక్తి చూపడం లేదు. రమ్యకృష్ణ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’ లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

కోలీవుడ్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం రమ్యకృష్ణ తమిళంలో విశాల్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి సైన్ చేసింది. విశాల్, హన్సిక జంటగా సుందర్ సి దర్శకత్వంలో ‘అంబల’ అనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ ‘పూజై’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అది పూర్తవగానే ఈ సినిమా షూటింగ్ లో విశాల్ జాయిన్ అవుతాడు. ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా రమ్యకృష్ణ ఇక నుంచి స్పీడుగా సినిమాలు చేస్తుందేమో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు