వినాయక చవితి కానుకగా ‘గోపాల గోపాల’ ఫస్ట్ టీజర్.?

వినాయక చవితి కానుకగా ‘గోపాల గోపాల’ ఫస్ట్ టీజర్.?

Published on Aug 21, 2014 3:58 PM IST

gopala-gopala
టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ ఒకటి. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే రోజు రోజుకీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ‘గోపాల గోపాల’ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని వినాయకచవితి కానుకగా అనగా ఆగష్టు 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో వినాయక చవితి మీద ఓ సీన్ ఉంటుంది, కావున ఈ చిత్ర టీం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ తీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం టీజర్ ని రెడీ చేసే పనిలో ఉన్నారని సమాచారం.

ఇటీవలే పవన్ కళ్యాణ్ – వెంకటేష్ లపై కూడా సీన్స్ షూట్ చేసారు కావున ఈ టీజర్ లో వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్ లుక్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందరూ పవన్ కళ్యాణ్ మోడ్రన్ శ్రీ కృష్ణుడి గెటప్ లో ఎలా ఉంటాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవన్ – వెంకీల లుక్ ని త్వరలోనే చూడవచ్చు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు