అక్టోబర్ లో ‘పిల్లా నువ్వులేని జీవితం’ విడుదల.

అక్టోబర్ లో ‘పిల్లా నువ్వులేని జీవితం’ విడుదల.

Published on Aug 21, 2014 4:49 PM IST

Pilla-Nuvvu-Leni-Jeevitham

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా సెకండ్ లుక్ పోస్టర్’ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేస్తున్నారు. మరో మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త టీజర్ ను విడుదల చేయనున్నారు. సాయి ధరమ్ తేజ ఫస్ట్ మూవీ ‘రేయ్’ ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. అందుకే ‘పిల్లా నువ్వులేని జీవితం’ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అక్టోబర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సాయి ధరమ్ తేజ సరసన రేజీనా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘యజ్ఞం’ ఫేం ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

దర్శకనిర్మాత వైవిఎస్ చౌదరి ‘రేయ్’ విడుదల విషయంలో మౌనం వహిస్తుండడంతో ముందుగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ విడుదల చేయడాలని మెగా కాంపౌండ్ నిర్ణయించినట్టు సమాచారం.

తాజా వార్తలు