
రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పండగ చేస్కో’. గత వారం పొల్లాచ్చిలో ప్రారంభమైన ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటితో పూర్తయింది. హీరో హీరోయిన్లు, బ్రహ్మాజీ తదితర నటినటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. పల్లెటూరి సంప్రదాయాలు ప్రతిభింబించే సన్నివేశాలు తీశారట. ‘బలుపు’ తర్వాత గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ‘లెజెండ్’ ఫేం సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. అతని క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారట. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

