సోనాక్షి సిన్హాని ఇబ్బందుల్లో పడేసిన ‘లింగా’ టీం

సోనాక్షి సిన్హాని ఇబ్బందుల్లో పడేసిన ‘లింగా’ టీం

Published on Aug 21, 2014 10:03 PM IST

sonakshi-sinha
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘లింగా’ సినిమాలో సోనాక్షి సిన్హా ఓ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నాటకలోని షిమోగా ప్రాంతంలోని జోగ్ ఫాల్స్ దగ్గర జరుగుతోంది. ఈ షూటింగ్ లోరజినీతో పాటు సోనాక్షి సిన్హా కూడా పాల్గొంటోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా సోనాక్షి సిన్హా ఇబ్బందుల్లో పడింది.

అసలు విషయంలోకి వెళితే షిమోగాలో స్టే చెయ్యడానికి స్టార్ హోటల్స్ లేవు. దాంతో లింకా ప్రొడక్షన్ టీం ఉన్న హోటల్స్ లో బెస్ట్ దాన్ని వెతికి టీం కి రూమ్స్ బుక్ చేసారు. కానీ సోనాక్షికి మాత్రం అక్కడ వసతులు, పరిస్థితులు నచ్చకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. ‘ఓ గాడ్ నేను మీకేం చేసాను మీరు ఇంత వరస్ట్ హోటల్ లో నాకు రూం బుక్ చేసి ఇక్కడ ఉంచారని’ సోనాక్షి ట్వీట్ కూడా చేసింది. దీనివల్ల సోనాక్షి అక్కడ స్టే చెయ్యడానికి ఇబ్బందులు పడుతోంది.

కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హాతో పాటు అనుష్క కూడా హీరోయిన్ గా నటిస్తోంది. రజినీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తుండగా, ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్ర టీం ఈచినెమాని రజినీ బర్త్ డే సందర్భంగా డిసెంబెర్ 12న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు