ఫస్ట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్న వరుణ్ తేజ్

ఫస్ట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్న వరుణ్ తేజ్

Published on Aug 22, 2014 9:00 AM IST

varun-tej

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికివరకూ చాలా మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు.. అదే కోవలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ముకుంద’. వరుణ్ తేజ్ మరియు ‘ముకుంద’ మూవీ ఫస్ట్ లుక్ ని చిరంజీవి బర్త్ డే కానుకగా నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు. ముకుంద మూవీలో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా, వరుణ్ తేజ్ తన లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ ని చూపించిన విధానం చాలా బాగుంది. ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసనపూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు