
అందాల భామ సమంత గత కొన్ని రోజుల నుండి కనబడడం లేదు. ఇటు మీడియాలోను, అటు సోషల్ మీడియాలో ఎక్కడా సమంత హడావుడి లేదు. తన ప్రతి సినిమా విడుదల ముందు ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత పాల్గొంటుంది. ఒకవేళ ఇతర సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటె పేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సినిమాకు సంబందించిన విశేషాలు, కబుర్లు చెప్తూ సినిమాకు పబ్లిసిటీ చేయడం సమంత హాబీ. ఎన్టీఆర్ ‘రభస’ ఈ నెల 29న విడుదలవుతుంది. ఈ సినిమాపై ఒక్క ట్వీట్ లేదు.. పోస్ట్ లేదు.. అసలు సోషల్ మీడియాలో సమంత కనబడడం లేదు.
‘సికందర్’ సినిమా విడుదలకు ముందు తెలుగు, తమిళ మీడియాకు విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సమంత.. ‘సికందర్’ విడుదల తర్వాత సైలెంట్ అయిపొయింది. ‘సికందర్’ సినిమాలో సమంత ఫస్ట్ టైం బికినీ వేసింది. అందాల ప్రదర్శనలో రెచ్చిపోయింది. ఓవరాల్ గా సమంత గ్లామర్ పెర్ఫార్మన్స్ పట్ల మిశ్రమ స్పందన లభించింది. మీడియా ముందుకొస్తే ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొనవలసి వస్తుందో అనే భయం సమంతలో ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి ఈ చెన్నై బ్యూటీ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

