చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకున్న అనుష్క

చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకున్న అనుష్క

Published on Aug 26, 2014 3:30 AM IST

anushka
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన యోగ బ్యూటీ అనుష్క తెలుగు మరియు తమిళంలో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. అనుష్క తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలైన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తుంటే, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘లింగా’, అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది.

ఈ నాలుగు క్రీజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అనుష్క గత సంవత్సర కాలంగా కాస్త గ్యాప్ కూడా తీసుకోలేదు. షూటింగ్ ల కోసం హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్ అని తిరుగుతూనే ఉంది. ఈ షెడ్యూల్స్ తో బాగా అలసిపోయిన అనుష్కకి కాస్త విరామం దొరకడంతో అనుష్క 10 రోజుల పాటు వెకేషన్ కి వెళ్ళింది. తను వెకేషన్ నుండి తిరిగి వచ్చాక మళ్ళీ తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇప్పటికే అనుష్క చేస్తున్న ఈ నాలుగు సినిమాల షూటింగ్ చాలా వరకూ పూర్తయ్యాయి.

తాజా వార్తలు