ద్విపాత్రాభినయం చేయనున్న మహేష్ బాబు.?

ద్విపాత్రాభినయం చేయనున్న మహేష్ బాబు.?

Published on Aug 26, 2014 10:00 AM IST

Koratala-shiva-mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. నేటితో పూర్తైన యూరప్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇది కాకుండా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. మహేష్ బాబుపై కాకుండా మిగతా నటీనటులపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. మహేష్ బాబు ఇప్పటివరకూ డ్యూయల్ రోల్ చేయలేదు. కానీ ఈ విషయంపై ఈ చిత్ర టీం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సెప్టెంబర్ నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. 2015 సమ్మర్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు