
ప్రస్తుతం డైలాగ్ కింగ్ మోహన్ బాబు చాలా ఆనందంలో వున్నాడు. తనకీ విష్ణుకి కలిపి రౌడీ హిట్ ఇచ్చిన ఆర్.జి.వి ఇప్పుడు విష్ణుని సోలో హీరోగా పెట్టి ‘అనుక్షణం’ సినిమాను తీసాడు. ఈ సినిమాలో విష్ణు తన డ్రీమ్ రోల్ చేశాడని ఇప్పటికే మోహన్ బాబు తెలిపాడు. ఇటీవలే హైదరాబాద్ చిత్రం ప్రైవేట్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు
ఆ సందర్భంగా మన కలెక్షన్ కింగ్ మాట్లాడుతూ “నాకు చిన్నప్పటినుండి ఇంగ్లీష్ సినిమాలు చాలా ఇష్టం. భాష రాకపోయినా పాత్రల హావభావాల బట్టి కధని అర్ధంచేసుకునేవాడిని. అటువంటి సినిమాలు మనకు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసాను. అనుక్షణం అటువంటి సినిమానే నని చెప్పడానికి చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా చూశాకే మీకు నేను ఆర్.జి.వి ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తానో తెలుస్తుంది” అని చెప్పాడు. ఈ సినిమా సెప్టెంబర్ 12న మనముందుకు రానుంది

