
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఒకరుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో నాని. ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేక సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నాని, ఇప్పుడు ఆచి తూచి ఎంచుకున్న సినిమాలను ఇప్పుడు ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.
లో బడ్జెట్ లో సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న మారుతి డైరెక్షన్ లో నాని ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మారుతి కూడా ‘కొత్త జంట’ తర్వాత తన తదుపరి సినిమా పలు హీరోలతో అనుకున్నప్పటికీ నానితో సినిమా చేయడానికి సముఖత చూపుతున్నాడు. మారుతి ప్రస్తుతం ఇద్దరు నిర్మాతలతో కమిట్ అయి ఉన్నారు. వాళ్ళిద్దరే డివివి దానయ్య మరియు యువి ప్రొడక్షన్స్. కానీ మారుతి ఇప్పటికీ ఎవరి బ్యానర్ లో ఫస్ట్ చెయ్యాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
మారుతి ముందుగా ఎవరితో సినిమా చేయాలి అనుకుంటే ఆ ప్రొడక్షన్ లో నాని మారుతి సినిమా అవుతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా కాకుండా నాని తమిళ రీమేక్ ‘పన్నాయిరుం పద్మినియుం’ స్క్రిప్ట్ ని చివరి దశకు తీసుకు వచ్చాడు. అలాగే ‘జెండాపై కపిరాజు’ సినిమా విడుదల కావాల్సి ఉంది.

