
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రభస’ ఆగష్టు 29న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దాంతో అభిమానులు ఈ సినిమా టికెట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టికెట్స్ బుకింగ్ నిన్న సాయంత్రం ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది సమయంలోనే అన్ని షోలకి, ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో సంబందించిన టికెట్స్ బుక్ అయిపోయాయి.
ఇది కాకుండా ఇరు రాష్ట్రాలలోని ప్రముఖ నగరాల్లో మరియు చెన్నైలో కూడా బెనిఫిట్ షోస్ కూడా పడనున్నాయి. బెనిఫిట్ షోస్ టికెట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా జోడీ కట్టిన ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. యాక్షన్, కామెడీ మరియు సెంటిమెంట్ కలగలిపి తీసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

