విక్రమ్ ‘ఐ’ తర్వాతే కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’

విక్రమ్ ‘ఐ’ తర్వాతే కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’

Published on Aug 27, 2014 4:32 PM IST

Kamal-Viswaroopam-2
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా మొదటి పార్ట్ 2013 లో విడుదలైంది. పలు వివాదాలను ఎదుర్కొని విడుదలైన ఆ పార్ట్ కి ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే విమర్శకుల నుండి కూడా చాలా ప్రశంశలు దక్కాయి. ఈ సినిమా ఎండ్ లోనే సెకండ్ పార్ట్ ట్రైలర్ చూపించిన కమల్ హాసన్ సినిమాని మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.

విడుదల ఆలస్యానికి కారణం సిజి వర్క్.. చాలా రోజుల క్రితమే విశ్వరూపం 2 షూటింగ్ పూర్తయినప్పటికీ సినిమాలో ఎక్కువ భాగం సిజి షాట్స్ ఉండడంవల్ల విడుదలకి ఆలస్యం అవుతోంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వేణు రవిచంద్రన్ ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.

‘ప్రస్తుతం సిజి వర్క్ చివరి దశలో ఉంది. త్వరలోనే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవుతాయి. మా బ్యానర్ లో వస్తున్నా ‘ఐ’ రిలీజ్ అయిన 3 లేదా 4 వారాల తరువాత ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. యాక్షన్ సీక్వెన్స్, సెంటిమెంట్ మరియు డాన్సులతో పర్ఫెక్ట్ మాస్ ఎంటర్ టైనర్ గా విశ్వరూపం 2 ఉంటుందని’ వేణు రవిచంద్రన్ అన్నాడు.

కమల్ హాసన్ హీరోగా, దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో పూజ కుమార్, ఆండ్రియా జెరేమియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజా వార్తలు