సంపూర్నేష్ బాబు హీరోగా www.వైరస్.Com.

సంపూర్నేష్ బాబు హీరోగా www.వైరస్.Com.

Published on Aug 28, 2014 10:02 AM IST

Sampoornesh-Babu
‘హృదయ కాలేయం’ లాంటి సూపర్ హిట్ చిత్రంతో సంచలనం సాధించిన హీరో సంపూర్నేష్ బాబు హీరోగా సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వం లో A.S.N films పతాకంపై సలీం, ఎ.జే.రాంబాబు లు సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ విజయదసమి సందర్భంగా ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రానికి www.వైరస్.Com అనే టైటిల్ ఖరారు చేశారు. బి వేర్ అనేది కాప్షన్.

ఈ సందర్భంగా దర్శకుడు సి.హెచ్.శివరామ కృష్ణ మాట్లాడుతూ… మా హీరో సంపూర్నేష్ బాబుని ఈ చిత్రంలో సరికొత్త కోణంలో చూపిస్తున్నాము. ఈ కథకి హీరో కరెక్ట్ గా సెట్ అయ్యాడు, సంపూర్నేష్ బాబు నుండి ఎలాంటి వినోదాన్ని ప్రేక్షకులు కోరుకుంటారో అది ఈ చిత్రంలో పూర్తిగా ఉంటుంది. అని అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… రెండు సంవత్సరాలుగా సినీ నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తున్నాము. ఎన్నో కథలు విన్నాము కాని అటు మాస్ , ఇటు క్లాస్ ప్రేక్షకులకె కాక అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే కథని దర్శకుడు చెప్పారు. నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింభించే కథ ఇది. యువతరాన్ని ఉత్తేజపరుస్తూ, ఒక వినూత్న కథనంతో, ఆద్యంతం ఆసక్తి పరిచే కధాంశంతో ఈ చిత్రం సాగుతుంది. కథ నచ్చడంతో నిర్మాతలుగా పరిచయం కావాలని డిసైడ్ అయ్యాం. విజయ దశమి నాడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. అక్టోబర్, నవంబర్ నెలలో షూటింగ్ చేసి డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణల వివరాలు తెలియజేస్తాం. అని చెప్పారు .

హీరో సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ… ఈ చిత్రంలో నేను ఇప్పటివరకు నటించని వెరైటీ పాత్రలో నటిస్తున్నాను. నాకు సరికొత్త ఇమేజ్ తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : వి.జే., కతావిస్త్హరణ, మాటలు: దుర్గా ప్రసాద్ రాయుడు , నిర్మాతలు : సలీం , ఏ.జే.రాంబాబు, కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం : ch.శివరామ కృష్ణ .

తాజా వార్తలు