ఎంజాయ్ చేయడం కాదు, హెల్ప్ చేయండి – ఇలియానా.

ఎంజాయ్ చేయడం కాదు, హెల్ప్ చేయండి – ఇలియానా.

Published on Aug 28, 2014 12:30 PM IST

Ileana
‘ఐస్ బకెట్ చాలెంజ్’ ప్రస్తుతం ఇండియాను ఒక ఊపు ఊపేస్తుంది. హీరో హీరోయిన్లు అందరూ ఈ చాలెంజ్లో పాల్గొంటున్నారు. మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హడావుడి. ఎంటర్టైన్మెంట్ వార్తలలో తారల ‘ఐస్ బకెట్ చాలెంజ్’కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ చాలెంజ్ లో పాల్గొంటున్న వారిపై సెటైర్లు వేసింది గోవా బ్యూటీ ఇలియానా.

మీపై ఒక బకెట్ ఐస్ వాటర్ కుమ్మరించుకున్నంత మాత్రానా ఏం లాభం ఉంటుంది. ఎఎల్‌ఎస్ సంస్థకు డొనేట్ చేయడమో లేదా ఆ వ్యాధి గురించి నిజంగా అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. సరదా చేయడం వలన ఉపయోగం ఎం ఉండదు. అంటూ ట్విట్టర్లో ఇలియానా స్పందించింది. ఎంజాయ్ చేయడం కాదు, హెల్ప్ చేయండి అనే అర్ధం వచ్చేలా ఇలియానా చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఐస్ బకెట్ చాలెంజ్’లో పాల్గొనే పలువురు సరదా కోసం చేస్తున్నారు తప్ప సహాయం చేయాలని ఉద్దేశ్యం లేదని విమర్శలు వస్తున్నాయి.

ileana-tweet

తాజా వార్తలు