సారధి స్టూడియోస్ లో ‘రుద్రమదేవి’ షూటింగ్

సారధి స్టూడియోస్ లో ‘రుద్రమదేవి’ షూటింగ్

Published on Aug 28, 2014 1:37 PM IST

Rudhramadevi
ఇండియాలోనే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మొట్ట మొదటి 3డి సినిమా ‘రుద్రమదేవి’. అనుష్క, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడిగానే కాకుండా ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ‘రుద్రమదేవి’ షూటింగ్ సారధి స్టూడియోస్ లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. అక్కడ ముఖ్య పాత్రలు పోషిస్తున్న నటీనటులపై బ్రిటీష్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. నిన్నటి వరకూ ఈ షూటింగ్ లో పాల్గొన్న రానా ఈ మూవీలో తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసాడు. ఇప్పటివరకూ ఈ సినిమా అనుకున్నదానికంటే బాగా వస్తుందని ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు.

గుణశేఖర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా సినిమాకి మరింత క్రేజ్ తీసుకురావడం కోసం ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రల కోసం స్టార్ నటీనటుల్ని కూడా ఎంచుకున్నారు. అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా కనిపిస్తుంటే కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, హంసా నందిని, కేథరిన్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి తోట తరణి అద్భుతమైన సెట్స్ ని రూపొందించారు.

తాజా వార్తలు