వరుణ్ తేజ్ ‘ముకుంద’ షూటింగ్ వివరాలు..

వరుణ్ తేజ్ ‘ముకుంద’ షూటింగ్ వివరాలు..

Published on Aug 31, 2014 11:45 AM IST

mukunda1
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ముకుంద’ సినిమా షూటింగ్ అమలాపురంలో జరుగుతుంది. సినిమాలో కీలకమైన మున్సిపల్ చైర్మర్ ఎన్నికల ప్రచార సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్లో భాగంగా వరుణ్ తేజ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ పూజ హెడ్గే, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు షూటింగ్లో పాల్గొంటున్నారు.

ఇటివల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ముకుంద’ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు