దిక్కులు చూడకు రామయ్య టైటిల్ ఆవిష్కరణ

దిక్కులు చూడకు రామయ్య టైటిల్ ఆవిష్కరణ

Published on Sep 4, 2014 11:42 PM IST

Dikkulu-Chudaku-Ramayya
సాయి కొర్రపాటి నిర్మాణ సంస్థనుండి వస్తున్న ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా టైటిల్ ఆవిష్కరణ చేశారు. ఈ సినిమాలో నాగ శౌర్య హీరో. అజయ్ ముఖ్యపాత్రధారి

దర్శకదిగ్గజం రాజమౌళి అసిస్టెంట్ త్రికోటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయంకానున్నాడు. కీరవాణి సంగీత దర్శకుడు. హృదయానికి హత్తుకునే ప్రేమకధగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు

వారాహి చలన చిత్రం వరుసపెట్టి విజయాలు సాధిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’ తరువాత నాగశౌర్య మరో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదలకానుంది

తాజా వార్తలు