ప్రీసేల్స్ లో ‘డెకాయిట్’ దూకుడు.. అపుడే 5 కోట్లు క్రాస్!

ప్రీసేల్స్ లో ‘డెకాయిట్’ దూకుడు.. అపుడే 5 కోట్లు క్రాస్!

Published on Apr 9, 2026 6:02 PM IST

Dacoit 4

ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శానియల్ డియో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే డెకాయిట్. మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్రెడీ సాలిడ్ బుకింగ్స్ వరల్డ్ వైడ్ అందుకుంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా డెకాయిట్ సాలిడ్ నెంబర్స్ సెట్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇలా ఇంకా రిలీజ్ కి ముందే ఈ సినిమా 5.59 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. దీనితో డెకాయిట్ కి మొదటి రోజు అడివి శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఈ సినిమాకి దక్కుతుంది అని చెప్పొచ్చు. మరి అధికారిక ఓపెనింగ్స్ ఏ లెవెల్లో ఉంటాయో చూడాలి. ఇక ఈ సినిమాలో విలన్ గా అనురాగ్ కశ్యప్ నటించగా ఈ సినిమాతోనే తను టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకి సుప్రియా యార్లగడ్డ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు