గూఢచారి 2 పై అడివి శేష్ క్లారిటీ.. వచ్చేది అప్పుడే..!

గూఢచారి 2 పై అడివి శేష్ క్లారిటీ.. వచ్చేది అప్పుడే..!

Published on Apr 9, 2026 5:01 PM IST

Adivi-Sesh

అడివి శేష్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ (గూఢచారి 2) కోసం సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో మూడు నెలల్లోనే థియేటర్లలోకి వస్తుందని అందరూ భావించారు. అయితే, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా ఈ చిత్రం కేవలం ఈ ఏడాది చివరలో మాత్రమే విడుదలవుతుందని శేష్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌కు నిరీక్షణ తప్పడం లేదు.

​ఇక బాలీవుడ్ ఆఫర్ల గురించి శేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘మేజర్’ సినిమా సూపర్ హిట్ కావడంతో హిందీలో ఆయనకు ఆరు భారీ ఆఫర్లు వచ్చాయట. అయితే వాటిలో నాలుగు వార్ మూవీస్ కావడం, రెండు బయోపిక్‌లు కావడంతో ఆయన వాటిని సున్నితంగా తిరస్కరించాడట. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతోనే శేషు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

​సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తీసిన ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అది పూర్తయిన తర్వాత మళ్లీ అటువంటి జోనర్ల జోలికి వెళ్లనని ఆయన స్పష్టం చేశాడు. భవిష్యత్తులో యుద్ధ సినిమాలు లేదా బయోపిక్‌లు చేయనని శేష్ తేల్చి చెప్పాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు