అడవి శేష్ హీరోగా పివిపి కొత్త సినిమా..!

అడవి శేష్ హీరోగా పివిపి కొత్త సినిమా..!

Published on Sep 4, 2014 5:00 PM IST

aadavi-sheshu
అడవి శేష్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి త్వరలో ఓ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా ద్వారా రవికాంత్ పెరుపు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. ‘ఈ సినిమా గురించి ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. రవికాంత్ చెప్పిన కథ బాగుంది. స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నాను. పివిపి సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. అని అడవి శేష్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ ‘పంజా’, ‘రన్ రాజా రన్’ సినిమాలతో అడవి శేష్ నటనకు ప్రసంశలు లభించాయి. ‘కిస్’ తర్వాత అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి’లో అడవి శేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు