ఒసేయ్ రాములమ్మ 2 పై కన్నేసిన దాసరి?

ఒసేయ్ రాములమ్మ 2 పై కన్నేసిన దాసరి?

Published on Sep 5, 2014 1:55 AM IST

Dasari-Narayan-rao
దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘ఒసేయ్ రాములమ్మ’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది . విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయ శాంతి నటించిన సినిమాలన్నిటిలోనూ పెద్ద హిట్ గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో వున్నారు

ప్రస్తుతం దాసరి తన 151వ సినిమా ఎర్ర బస్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమానే కాక దాసరి విష్ణుని హీరోగా పెట్టి తమిళ సూపర్ హిట్ సినిమా మంజపై ని రిమేక్ తీస్తున్నాడు. ఈ సీక్వెల్ ని ఆ తరువాత ప్లాన్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే విజయశాంతి సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రకటించింది. కాబట్టి ఈ సినిమా కార్యరూపం దాల్చే అవకాశాలు వున్నాయి

తాజా వార్తలు