యాక్షన్ మూడ్ లో ఉన్న బాలకృష్ణ

యాక్షన్ మూడ్ లో ఉన్న బాలకృష్ణ

Published on Sep 5, 2014 1:32 PM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ తనుకు ఓటు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధిగా, మరొవైఅపు అభిమానులను మెప్పించే నటుడుగా రెండు పనులను ఎంతో సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణపై యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.

బాలకృష్ణ కాలికి గాయమై మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయిన తర్వాత కుతూమ్బ నేపధ్యంలో వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. ‘ఇటీవల షూట్ చేసిన ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా బాగా వచ్చాయని, అసలు సిసలైన నాయకుడు అంటే ఇలానే ఉండాలి అనేలా బాలకృష్ణ పాత్రని డిజైన్ చేసినట్లు’ ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

తాజా వార్తలు