
కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి సినిమా ఘనవిజయం సాధించడంతో తనకి డిమాండ్ బాగా పెరిగింది. తన రెండవ సినిమాకే సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా తీసే అవకాశం సొంతంచేసుకున్నాడు. ఇప్పుడు యూనివర్సల్ మీడియా బ్యానర్ లో మరొక సినిమాకు అంగీకారం తెలిపాడు
ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ “మిర్చి” సినిమా తరువాత దానయ్యగారు నన్ను సంప్రదించి సినిమా తీద్దామని అడిగారు. కాకపోతే మహేష్ సినిమా మైత్రీ మివీస్ తో తీస్తానని మాటివ్వడంతో ఆ చిత్రం తరువాత దానయ్య ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాడు. ఈ సినిమాలో అగ్ర నటుడు నటిస్తాడని కూడా తెలిపారు

