క్రిష్ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్..!

క్రిష్ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్..!

Published on Sep 6, 2014 11:46 AM IST

krirsh-rajendhra-prasad

నాజర్, బేబీ సారా ముఖ్య పాత్రలలో నటించిన తమిళ సినిమా ‘శైవం’. అమలా పాల్ భర్త ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ నెలలో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణను సొతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘శైవం’ తెలుగు రీమేక్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తమిళంలో నాజర్ చేసిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

పస్తుతం ఠాగూర్ సినిమా హిందీ రీమేక్ ‘గబ్బర్’ షూటింగ్లో క్రిష్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ‘శైవం’ రీమేక్ ప్రారంభమవుతుంది. కృష్ణంవందే జగద్గురుమ్’ తర్వాత క్రిష్ తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ సినిమా ఇదే.

తాజా వార్తలు