‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా టీచర్లకు అంకితం

‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా టీచర్లకు అంకితం

Published on Sep 7, 2014 3:17 AM IST

Krishnamma-Kalipindi-Iddarn
సుధీర్ బాబు ప్రస్తుతం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ప్రేమ కధాచిత్రమ్ సినిమా తరువాత మరోసారి నందితతో జతకట్టాడు. వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరిందని గత చిత్రంతో తెలిసింది. ఈ సినిమా ట్రైలర్ మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమా గురించి
సుధీర్ బాబు మాట్లాడుతూ మా చిత్రం టీచర్లకు అంకితం అని తెలిపారు

కన్నడ సినిమా చార్మినార్ కి ఇది రిమేక్. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ముఖ్యపాత్ర పోషిస్తాడని పుకార్లు వినిపించాయి. హరి సంగీతదర్శకుడు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష, శ్రీధర్ లు నిర్మాతలు

తాజా వార్తలు