
ఇండియన్ స్క్రీన్ పై లెజెండ్ హీరో అయిన కమల్ హాసన్ తన కెరీర్లో ఇప్పటి వరకూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. కమల్ హాసన్ ఓ నటుడిగానే కాకుండా ప్రొడక్షన్, డైరెక్షన్, స్క్రిప్ట్ మరియు ఇతర ఫిల్మ్ మేకింగ్ లో తన ప్రతిభని చూపించారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ ఒక రైటర్ గా కూడా తన ప్రతిభని చూపించడానికి సిద్దమవుతున్నాడు.
కమల్ హాసన్ షూటింగ్ ఫినిష్ చేసిన ‘ఉత్తమ విలన్’ సినిమాకి మెయిన్ రైటర్ గా కమల్ హాసన్ వ్యవహరించాడు. ఈ సినిమా డైలాగ్స్ అవుట్ పుట్ విషయంలో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. మునుపెన్నడూ కనపడని గెటప్ లో కమల్ కనిపించనున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. రమేష్ అరవింద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

