
షూటింగ్స్ కి కొంతకాలం గ్యాప్ ఇచ్చిన యంగ్ హీరో నాని ప్రస్తుతం వరుసగా తన సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే ఎస్ఎస్ రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘స్టూడెంట్ నెం 1’ సినిమా చేసిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మాతగా ఓ సినిమా ఉంటుందని తెలియజేశాం.
తాజా సమాచారం ఈ సినిమాకి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ ని దాదాపు ఖరారు చేసారు. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన నాగు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నాని సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది. రాకేశ్ – నవీన్ కలిసి సినిమాటోగ్రాఫర్స్ గా కలిసి పనిచేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.
నాని ఇది కాకుండా పన్నాయిరుం పద్మినియుం సినిమా రీమేక్ చేసే పనిలో కూడా ఉన్నాడు. ఇది కాకుండా ‘జెండాపై కపిరాజు’ విడుదలకి సిద్దమవుతోంది.

