కొత్త సినిమాకు సైన్ చేసిన అల్లు శిరీష్

కొత్త సినిమాకు సైన్ చేసిన అల్లు శిరీష్

Published on Sep 11, 2014 2:56 PM IST

allu-seerish
అల్లు శిరీష్ తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి సినిమా ‘గౌరవం’తో ప్రయోగం చేసిన శిరీష్.. రెండవ సినిమా ‘కొత్త జంట’తో విజయం అందుకున్నారు. ఈ ఏడాది మే నెలలో ‘కొత్త జంట’ విడుదలయింది. ఇప్పటి వరకు మరో సినిమా ప్రారంభించలేదు అల్లు శిరీష్. అయితే కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టారు.

‘ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ‘కొత్త జంట’ తర్వాత చేయబోయే సినిమాపై ఓ నిర్ణయం తీసుకున్నాను. స్క్రిప్ట్, టెక్నీషియన్లు ఖరారయిన తర్వాత సినిమా గురించి త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం.’ అని సోషల్ మీడియాలో అల్లు శిరీష్ తెలిపారు.
allu-sirish-tweet12

తాజా వార్తలు