పాత ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి ప్రయత్నం.. పబ్లిక్ గా ధురంధర్ సత్తా చూసిన రెబెల్ స్టార్..!

పాత ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి ప్రయత్నం.. పబ్లిక్ గా ధురంధర్ సత్తా చూసిన రెబెల్ స్టార్..!

Published on Apr 9, 2026 9:00 AM IST

sadeep

‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తుంది. తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి హైదరాబాద్‌లోని ‘అల్లు సినిమాస్’లో వీక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా బయట ఎక్కువగా కనిపించని ప్రభాస్‌ను, పబ్లిక్ థియేటర్‌కు తీసుకువచ్చి ఆ మాస్ జాతరను స్వయంగా అనుభూతి చెందేలా చేయడంలో సందీప్ సక్సెస్ అయ్యాడు. రణవీర్ సింగ్ హై-వోల్టేజ్ పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రభాస్ హర్షం వ్యక్తం చేశాడు.

​నిజానికి ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ సినిమాల్లో ఆ పాత ఎనర్జీ కొంత తగ్గిందనే విమర్శలు ఉన్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌పై కూడా సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్స్ వస్తుంటాయి. ఇప్పుడు ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రం ‘స్పిరిట్’ కోసం సందీప్ వంగాతో చేతులు కలిపాడు. రాజీ పడకుండా సినిమాలను తెరకెక్కించే సందీప్, ప్రభాస్‌ను థియేటర్‌కు తీసుకెళ్లడం వెనుక ఒక బలమైన కారణం ఉందనే చెప్పాలి.

ప్రేక్షకుల్లో ఉన్న ఆ ఆకలిని, ఒక నటుడి అంకితభావాన్ని దగ్గరగా చూపిస్తే.. అది ప్రభాస్‌ను తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు తెస్తుందని సందీప్ భావించి ఉండవచ్చు. ​ఒకవేళ ఈ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ప్రభాస్‌లో ఆ పాత స్పార్క్‌ను మళ్ళీ రాజేస్తే, రాబోయే రోజుల్లో మనం మరింత పవర్‌ఫుల్ ప్రభాస్‌ను చూడటం ఖాయం. రణవీర్ సింగ్ వంటి నటుడి ఎనర్జీని చూశాక, ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ కూడా తనను తాను కొత్తగా మలుచుకునే అవకాశం ఉంది.

తాజా వార్తలు